హైదరాబాద్ : బూస్టర్ డోస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10 (ఆదివారం) నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ పంపిణీని మొదలుపెట్టనున్నట్టు ప్రకటించింది. అయితే ప్రయివేటు ఆస్పత్రుల ద్వారా బూస్టర్ డోస్ పంపిణీ చేయనున్నట్టు కేంద్రం తెలపడంతో పలు వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, మొదటి, రెండో డోసుల కోసం ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా కొనసాగుతున్న ఉచిత టీకా కార్యక్రమం అలాగే కొనసాగుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm