హైదరాబాద్ : తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ర్ట ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే పోలీసు ఉద్యోగాల భర్తీకి, గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా ఎక్సైజ్, రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 677 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్(ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల 614 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. తదితర వివరాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm