న్యూఢిల్లీ: బ్యాంకు లావాదేవీల పై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. అందుకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. ఒకవేళ ఎవరైనా బ్యాంక్‌లో 20 లక్షలు డిపాజిట్ చేసినా లేక విత్‌డ్రా చేసినా అప్పుడు వారు ఆధార్ లేదా పాన్ నెంబర్‌ను వెల్లడించాలని ప్రభుత్వం తెలిపింది. ఒక వార్షిక సంవత్సరంలో 20 లక్షల లావాదేవీలు జరిగే అకౌంట్లకు పాన్ లేదా ఆధార్ తప్పనిసరి అవుతుంది. బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో కరెంట్ అకౌంట్ లేదా క్యాష్ క్రెడిట్ అకౌంట్‌ను ఓపెన్ చేస్తే కూడా పాన్ లేదా ఆధార్ సంఖ్యను చెప్పాల్సి ఉంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm