హైదరాబాద్ : చిన్నారులను కిడ్నాప్ చేశారంటే కరాటే కల్యాణిపై అభియోగాలు రావడంతో ఆదివారం ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో కరాటే కల్యాణి ఇంట్లో లేదు. అయితే తాజాగా ఆమె కనిపించడం లేదంటూ ఆమె తల్లి విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కల్యాణి దత్తపుత్రిక మౌక్తిక కూడా కనిపించడం లేదంటూ చెబుతోంది. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఆదివారం నుంచి కల్యాణి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని తెలిపారు. వాళ్లెక్కడున్నారో పోలీసులే వెతికి చెప్పాలని కోరారు. అయితే అజ్ఞాతంలో కరాటే కల్యాణి ఉండడం ప్రస్తుతం చర్చనియాంశమైంది.
Mon Jan 19, 2015 06:51 pm