హైదరాబాద్: సీఎం జగన్ సభలో గందరగోళం నెలకొంది. జగనన్నా.. ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ప్రజలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఫ్లెక్సీలు ప్రదర్శించిన వ్యక్తులను పోలీసులు బయటకు పంపారు. మరోవైపు గణపవరంలో జగన్ పర్యటన దృష్ట్యా విద్యార్థులపైనా పోలీసులు ఆంక్షలు విధించారు. మూర్తి రాజు డిగ్రీ కాలేజీలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఇదే కాలేజీలో సీఎం సభ ఏర్పాటు చేయడంతో పరీక్ష కేంద్రం మార్చారు. డిగ్రీ విద్యార్థుల పరీక్ష కేంద్రాన్ని శేషామహల్‌లోని గర్ల్స్ హైస్కూల్‌కు మార్చారు. సీఎం జగన్ పర్యటన ముగిశాక మధ్యాహ్నం 2 గంటలకు డిగ్రీ విద్యార్థులు.. గర్ల్స్ హైస్కూల్లో పరీక్షకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ శ్యామ్‌బాబు ప్రకటన చేశారు. పరీక్ష కేంద్రం మార్పుతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm