గాంధీనగర్: గుజరాత్‌లో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గాయకుడు యోగేశ్ గద్విపై కేసు నమోదైంది. విశాల్ గర్వ అనే దళిత హక్కుల కార్యకర్త ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. గద్విపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గుజరాత్‌లోని కచ్ జిల్లా బుజ్‌లో ఆదివారం భీంరత్న సమ్రాస్ కన్య విద్యాలయ అనే పేరుతో నిర్మించిన బాలికల హాస్టల్ ప్రారంభోత్సవానికి గద్వి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన సంగీతం కచేరి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పలు మార్లు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమం బీజేపీ నేతృత్వంలో జరగగా.. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ నిమాబెన్ ఆచార్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్, జనరల్ సెక్రెటరీ అండ్ ఎంపీ వినోద్ చద్వ, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వారి సమక్షంలో దళితులపై గద్వి అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2022 04:38PM