జనగామ: పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం జనగామ జిల్లా పాలకుర్తిలోని బషారత్ గార్డెన్స్‌లో ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. పిల్లలకు పెడుతున్న భోజన వసతి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శిక్షణకు వచ్చిన ఉద్యోగార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా ఉషా దయాకర్ రావు అధ్వర్యంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయన్నారు. కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, అంబులెన్స్ లు వంటివి ఎన్నో చేశాం. అలాగే ఈ ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm