హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ లు హీరోయిన్ లుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుసగా ఇంటర్వూలు ఇస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో సోనాల్ పాత్ర గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సినిమాలో సోనాల్ పాత్రను గురించి అడగొద్దు అని అన్నారు. ఎందుకంటే అది సస్పెన్స్ అని.. అది తెరపై చూడాల్సిందేనని చెప్పారు. ఇప్పుడే చెప్పేస్తే ఆ కిక్కుపోతుంది అన్నారు. అలాగే సోనాల్ కూడా మాట్లాడుతూ.. తన పాత్ర ఏంటో చెప్పేయలేనని అంది. దాంతో ఆమె పాత్ర ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm