-ఐకెపి సెంటర్ లో కనీస వతులు కరువు
-ఐకెపి ఎంపీఎం నిర్లక్ష్యం...
నవతెలంగాణ - చిన్నకోడురు
వడ్ల కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలి కార్మికుడు వడదెబ్బ తగిలి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడురు మండల పరిధిలోని పెద్దకోడూరు గ్రామానికి చెందిన హమాలి కార్మికుడు గౌరీగోని పెంటయ్య(40) వడ్ల కొనుగోలు కేంద్రంలో హమాలి కార్మికుడిగా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం 11 గంటల సమయానికి అతనికి వడదెబ్బ తగిలింది. దాంతో అతను మృతి చెందాడు. అయితే ఐకెపి సెంటర్ లో కనీస వసతులు కరువైయ్యాయని, వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వాహకులు.. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఐకెపి ఎంపీఎం నిర్లక్ష్యానికి హమాలి కార్మికుడు బలికావటంతో మృతుని కుటుంబానికి ఐకేపీ సెంటర్ ద్వారా రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని చిన్నకోడూరు మండలం సి ఐ టి యు అధ్యక్షులు చల్లారపు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2022 07:04PM