హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. ‘‘పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమరాలను ఏర్పాటు చేయాలి. పొరపాట్లకు తావు లేకుండా పకడ్బంధీగా పరీక్షలను నిర్వహించాలి. మే 23వ తేదీ నుంచి జూన్ 1 వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని కూడా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో కేంద్రాల్లోకి అనుమతించకూడదు. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా.. వెంటనే పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలి. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద డీఈఓ, ఏంఈవో ఫోన్ నెంబర్లను డిస్‌ప్లే చేయాలి అని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm