న్యూఢిల్లీ: అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా మూడు రోజుల్లో 10 మంది చనిపోయారు.ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో మూడు రోజుల్లో వరదలు వెల్లువెత్తిన సంఘటనల్లో అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లలో 10 మంది మరణించారని రెండు రాష్ట్రాల అధికారులు తెలిపారు.సోమవారం విడుదల చేసిన అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నివేదిక ప్రకారం కాచర్ జిల్లాలో వరదల వల్ల ఇద్దరు మరణించారు. శుక్రవారం నుంచి అసోం రాష్ట్రంలో మృతుల సంఖ్య 5కి చేరుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మరణించారు.ఈ ఘటనల్లో మరో ఆరుగురు గాయపడ్డారు.ఈశాన్య ప్రాంతంలోని ఐదు రాష్ట్రాల్లో మే 1 నుంచి 16 వరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది.గౌహతిలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అసోం ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ సరిహద్దు గోడ కూలిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm