చెన్నై: రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ఆరు రాజ్యసభ స్థానాల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విడుదల చేసిన ప్రకటనలో, రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణ 31వ తేదీతో ముగుస్తుందన్నారు. నామినేషన్లు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు (శని, ఆదివారాలు మినహా) దాఖలుచేయవచ్చని తెలిపారు. జూన్ 1న నామినేషన్ల పరిశీలన, 3న ఉపసంహరణ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ 10వ తేది (ఏకగ్రీవం కాని స్థానాలకు) ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని, 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని తెలిపింది. అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి ఎన్నికల అధికారిగా, అసెంబ్లీ వ్యవహారాల సహాయ అధికారి అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారని, సచివాలయంలోని కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని ఎన్నికల కమిషన్ తెలియజేసింది.
Mon Jan 19, 2015 06:51 pm