న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కార్తీ చిదరంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగైల్లోని ఏడు ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నది. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు నగదు తరలించారని ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఇటీవల కార్తీ చిదరంబరం సీబీఐ కేసును సైతం నమోదు చేసింది. సీబీఐ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Mon Jan 19, 2015 06:51 pm