అమరావతి : మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడికాయల లోడుతో ఓ లారీ సత్తుపల్లి నుంచి విస్సన్నపేటకు బయల్దేరింది. ఈ క్రమంలో సన్నపేట శివాలయం వద్ద పోట్లపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంటి బయట సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా అతన్ని లారీ ఢీ కొట్టింది.
అనంతరం లారీ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ లారీ డ్రైవర్, క్లీనర్‌లను ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 May,2022 11:19AM