న్యూఢిల్లీ : దేశీయ మార్కెట్‌లో ధరల పెరుగుదలతో గోధుమల ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని అమెరికా వ్యతిరేకించింది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ మాట్లాడుతూ.. గోధుముల ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన నివేదికను పరిశీలించినట్టు తెలిపారు. భారత్ చర్య వల్ల ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఆహార ధాన్యాల కొరత మరింత పెరుగుతుందని తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఎగుమతులను పరిమితం చేయొద్దని ఆయా దేశాలను ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. నిషేధంపై భారత్ పునరాలోచన చేయాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm