ముంబై : ముంబైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్థర్ రోడ్ జైలులో ఓ యువకుడిపై మరో యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీసులు ఈ వ్యవహారంపై అసహజ నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని గోవండిలోని గౌతమ్ నగర్ నివాసి మహ్మద్ ఇర్షాద్ ఇస్లాం షేక్‌గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆర్థర్ రోడ్ జైలు సర్కిల్ నంబర్ 1లో ఉన్న బ్యారక్ నంబర్ 7 లో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుండి 2:30 గంటల మధ్య అండర్ ట్రయల్ నిందితుడిగా ఉన్న 20 ఏండ్ల యువకుడిని మరో 19 ఏండ్ల అండర్ ట్రయల్ ఖైదీ నొట్లో గుడ్డులు పెట్టి చంపుతానంటూ బెదిరించాడు. అనంతరం లైంగికదాడికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం జైలు అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో జైలు అధికారులు ఎన్ఎమ్ జోషీ మార్గ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. బాధితుడిని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జైలు అధికారులు తెలిపారు
పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 377 (అసహజ నేరాలు), 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష), 506 (నేరసంబంధమైన బెదిరింపులకు శిక్ష) కింద కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 May,2022 11:51AM