హైదరాబాద్ : తెలంగాణకు భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం 10 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈనెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో మంత్రి సమావేశం కానున్నారు. అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm