హైదరాబాద్ : సెక్యూరిటీ గార్డుపైకి స్కూల్ బస్సు దూసుకెళ్లడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కండర్ షైర్ స్కూల్ కు చెందిన బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో స్కూల్ సెక్యూరిటీ గార్డుపైకి బస్సు దూసుకెళ్లింది. దాంతో సెక్యూరిటీ గార్డుకు తీవ్రగాయాలవ్వడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులంతా స్కూల్ లోపలికి వెళ్లిపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది.
ఇదిలా ఉండగా.. బస్సు ప్రమాదం గురించి ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులపై సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దాంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 May,2022 12:27PM