హైదరాబాద్ : బ్లాక్ ఫంగస్ బారిన పడి దంతాలను కోల్పోయిన వ్యక్తికి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన 42 ఏండ్ల అమిత్ బిరాదర్ కు సెకండ్ వేవ్ లో కరోనా సోకి 22 రోజులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం కోలుకున్నాప్పటికీ బ్లాక్ ఫంగస్ సోకింది.ఆ బ్లాక్ ఫంగస్ సైనస్ ఎముక వరకూ విస్తరించడంతో అతని దంతాల వరుసలో మూడు పళ్లు మినహా పైదవడ ఎముక మొత్తం ఊడిపోయింది. దాంతో అతను తీవ్రమైన నొప్పి, వాపు, రక్తస్రావంతో బాధపడేవాడు. చికిత్స కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా సరైన చికిత్స దొరకలేదు. చివరకు తెలంగాణ రాష్ట్రంలోని బోధన్‌లో ఖుషీ మల్టీ స్పెషాలిటీ డెంటల్ ఇన్‌ప్లాంట్ అండ్ ట్రామా సెంటర్ ను సంప్రదించాడు. అక్కడ వైద్యుడు శ్రీకాంత్ దేశాయ్.. అమిత్ దేశాయ్ ఆరోగ్య పరిస్థితిని చూశారు. అమిత్ చెవి కింద ఉన్న ఎముక సహాయంతో సహజత్వం ఉట్టిపడేలా శస్త్ర చికిత్స చేసి కృత్రిమ పళ్లను అమర్చారు. వైద్య పరిభాషలో ఈ ప్రక్రియను 'ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ఇన్ పోస్ట్ కొవిడ్ మ్యూకర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)` అని పిలుస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 May,2022 12:38PM