హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కేవలం తెలంగాణలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. మంగళవారం మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దావోస్ లో ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో దావోస్‌లో మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలుకుతూ ఆయన అభిమానులు భారీ హోర్డింగ్ లను ఏర్పాటు చేశారు. అనిల్ కుర్మాచలం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వీటిని ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm