హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు నిందితులు మోబిన్, మహ్మద్లకు ఐదు రోజుల పోలీసు కస్టడీ తాజాగా ముగిసింది. కస్టడీలో నిందితులు పలు కీలక ఆధారాలు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. నాగరాజును హత్య చేసే ముందు అతని మెయిల్ ను నిందితులు హ్యాక్ చేసి అతను ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకున్నారు.
నిందితులు మోబిన్, మహ్మద్లు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నాగరాజు హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. నాగరాజు కదలికలను తెలుసుకునేందుకు మొబైల్ ట్రాకర్ అప్లికేషన్ ను ఉపయోగించారన్న అనుమానం నిజమైందన్నారు. నాగరాజు తన మెయిల్ ఐడీకి ఫోన్ నెంబర్ నే పాస్ వర్డ్ గా పెట్టుకున్నాడని.. దాంతో నాగరాజు మెయిల్ ను మసూద్ సులువుగా హ్యాక్ చేశాడని చెప్పారు. ఇద్దరు నిందితులకు ఏ సంస్థతోనూ సంబంధాలు లేవు. ఓ వర్గం సంస్థలతో నిందితులకు సంబంధాలు ఉన్నాయని కొందరి ఆరోపణలను పోలీసులు ఖండించారు. నిందితులకు ఏ సంస్థతో సంబంధాలు లేవని పేర్కొంటూ నిందితులను కోర్టులో హాజరుపర్చారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 May,2022 01:12PM