హైదరాబాద్ : ప్లాస్టిక్ సర్జరీ వికటించి కన్నడ టీవీ నటి మృతి చెందింది. వివరాల్లోకెళ్తే.. ప్రముఖ కన్నడ టీవీ నటి చేతనా రాజ్ (21) ఈ నెల 16న ఫ్యాట్ ఫ్రీ కోసం బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. అయితే సర్జరీ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. సాయంత్రానికి ఆమె ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం మొదలైంది. ఆ తర్వాత ఆమె పరిస్థితి మరింత విషమించి మృతి చెందింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు.
అయితే ప్లాస్టిక్ సర్జరీ విషయాన్ని చేతన తన తల్లిదండ్రులకు చెప్పకుండా.. స్నేహితులతో కలసి ఆమె ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె మరణానికి కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. హాస్పిటల్ కు వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేశారు. గీత, దొరసాని, ఒలవిన్ నిల్దాన్ వంటి కన్నడ సీరియల్స్తో చేతనా రాజ్ కన్నడలో. అలాగే హవయామి అనే సినిమాలో కూడా ఆమె నటించింది. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 May,2022 01:22PM