హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుంభకర్ణుడులా కేసీఆర్ 16 రోజులు ఫాంహౌస్ లో సేదతీరి వచ్చాడని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. 'కుంభకర్ణుడులా కేసీఆర్ 16 రోజులు ఫాంహౌస్ లో సేదతీరి వచ్చాడు. రైతేమో ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నాడు. ఐకేపీ కేంద్రాలలో టార్పాలిన్ లు గతిలేక రైతు కష్టం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. ఇదేం రాక్షసత్వం కేసీఆర్! కర్షకులే నీకు కర్రుకాల్చి వాత పెట్టుడు ఖాయం` అని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm