నవతెలంగాణ-గోవిందరావుపేట
కారు, ద్విచక్ర వాహనం ఎదురుగా ఢీకొన్న సంఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని పసర గ్రామ సమీపంలో గుండ్ల వాగు అటవీశాఖ నర్సరీ ప్రాంతంలో 163 జాతీయ రహదారి పై మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక పసర పోలీస్ స్టేషన్ ఎస్సై కరుణాకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట ప్రాంతానికి చెందిన రాపోలు శ్రీకాంత్ (25) తన షైన్ ద్విచక్రవాహనంపై కాటా పూర్ లో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన మద్యం వ్యాపారి కార్తీక్ రెడ్డి కి చెందిన బెలినో కారు తాడ్వాయి వైపు నుండి గోవిందరావుపేట వస్తున్నది. అయితే 163 జాతీయ రహదారి పై రెండు వాహనాలు ఢీకొట్టుకోవడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య రేవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సిహెచ్ కరుణాకర్ రావు తెలిపారు. కాగా మృతునికి భార్యతో పాటు మూడేండ్ల కూతురు, 8 నెలల కొడుకు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 May,2022 04:21PM