న్యూఢిల్లీ : గోధుమల ఎగుమతిపై కేంద్రం ఇటీవల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిషేధాజ్ఞలను కేంద్రం కాస్త సడలించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం సడలింపులను ప్రకటించింది. గోధమల కన్‌సైన్‌మెంట్‌లను పరీక్షల కోసమో, సిస్టమ్స్‌లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్‌కు మే 13 లేదా అంతకంటే ముందు అప్పగిస్తే, అలాంటి వాటిని ఎగుమతి చేయడానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. ఇక ఈజిప్ట్‌కు వెళ్లే కన్‌సైన్‌మెంట్‌కు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే ఇవి కండ్లా నౌకాశ్రయంలో డౌన్‌లోన్ అవుతోంది. ఈజిప్టు ప్రభుత్వంతో పాటు ఈ గోధుమలను ఎగుమతి చేస్తున్న మెసర్ మీరా ఇంటర్నేషనల్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ సంస్థ విజ్ఞప్తి చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm