హైదరాబాద్: నగరంలోని అఫ్జల్ గంజ్ పరిధిలో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఇక్కడి వ్యాపారులు ఆరోపించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పేరుతో జాంబాగ్ పూలమార్కెట్లో వసూళ్లుచేస్తున్నారు. బల్లియా సిబ్బందిగా చెప్పుకునే కొందరు డబ్బులు తీసుకొని రసీదులు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. బల్లియా సిబ్బందిగా చెప్పుకుంటున్నవారు వారంలో మూడ్రోజులు పాటు ఇలా అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని చెబుతున్నారు. 300 దుకాణాల్లో రూ.500ల నుంచి రూ.1000 వరకు వసూళ్లు చేస్తున్నారని వారు ఆరోపించారు. తమి పొట్ట కొడుతున్న వసూల్ రాయుళ్ల నుంచి ఆదుకోవాలంటూ ఇక్కడి పూల వ్యాపారులు అధికారులను వేడుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm