కొలంబో : శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మంగళవారం వీగిపోయింది. తమిళ్ నేషనల్ అలయెన్స్ ఎంపీ ఎంఏ సుమంతిరన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది ఎంపీలు ఓటు వేయడంతో ఈ తీర్మానం వీగిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. రాజపక్సపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చర్చించేందుకు వీలుగా పార్లమెంటు స్టాండింగ్ ఆర్డర్స్‌ను సస్పెండ్ చేయాలని ఈ తీర్మానం కోరింది. అయితే ఈ తీర్మానానికి అనుకూలంగా కేవలం 68 మంది ఎంపీలు మాత్రమే ఓటు వేసినట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm