కాలిఫోర్నియా : ధ్వని వేగం కన్నా 5 రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లే హైపర్ సోనిక్ మిస్సైల్ సిస్టమ్ ను అమెరికా సైన్యం విజయవంతంగా పరీక్షించింది. బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ ద్వారా గగనతలం నుంచి అత్యంత వేగంగా దాడులు చేయగలిగే ఏజీఎం-183ఏ ను ప్రయోగించగా అది నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని అమెరికా ప్రకటించింది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఈ పరీక్ష జరిగిందని తెలిపింది. గతంలో ఇందుకోసం మూడుసార్లు పరీక్షలు నిర్వహించగా అవి విఫలమయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm