తాడేపల్లి : ఏపీలో త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ సీట్లకు జరగనున్న ఎన్నికల కోసం అధికార వైసీపీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు తుది జాబితాను సీఎం జగన్ ఖరారు చేయగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు మంగళవారం నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. అయితే తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.
విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు బొత్స వెల్లడించారు. అలాగే జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు, బీద మస్తాన్‌రావు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిలకు అవకాశం కల్పించినట్టు వారు తెలిపారు. నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు బీసీలేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 May,2022 05:24PM