హైదరాబాద్ : ఇటీవలి కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. ఔరంగాబాద్‌కు చెందిన సమాధాన్ సాబ్లే అనే 24 ఏళ్ల యువకుడు.. తనకన్నా ఆరేళ్లు పెద్దదైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన తర్వాత తన భార్య ప్రవర్తనతో విసుగెత్తిన అతను.. ఉరేసుకొని చనిపోయాడు.
ఈ విషయం తెలిసి కేసు నమోదు చేసుకున్న పోలీసులకు.. యువకుడి గదిలో సూసైడ్ నోట్ దొరికింది. దానిలో ఆ యువకుడు పేర్కొన్న కారణాలు చూసి అధికారులు కూడా షాకయ్యారు. తన భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదని, సరిగా నడవలేదని, మాట్లాడలేదని అతను రాసుకొచ్చాడు. ఇలాంటి మహిళతో జీవితం కొనసాగించలేనని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 May,2022 05:27PM