P. Chidambaram, the Economic Terrorist, lacks moral character. Law colleges can have him as a case study in their courses. From money laundering to taking bribe to facilitate Visa for Chinese citizens, he committed all crimes in IPC by misusing his powers as Cabinet Minister.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 17, 2022
1/5
అమరావతి : కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చిదంబరంను ఓ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు. చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది అని.. ఆయనకు నైతికతే లేదని అన్నారు. న్యాయ కళాశాలలు చిదంబరం వ్యవహారాలను కేస్ స్టడీలుగా తీసుకోవాలని చెప్పారు. మనీ ల్యాండరింగ్ నుంచి చైనా పౌరుల నుంచి లంచాలు తీసుకుని వీసాలు ఇప్పించారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేబినెట్ మంత్రి హోదాలో చిదంబరం ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని అన్ని నేరాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
తాను చేసిన అన్ని తప్పులకు చిదంబరం ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తక్షణమే చిదంబరంను అరెస్ట్ చేయాలని ఓ హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేశారు. 2004- 14 మధ్యలో కేంద్ర మంత్రి హోదాలో చిదంబరం తీసుకున్న అన్ని నిర్ణయాలు, వ్యవహారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తన ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టించిన చిదంబరం అత్యంత నిర్దయగా వ్యవహరించారని ఎంపీ అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైందని చెప్పారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ చిదంబరం కోట్లాది ధనాన్ని సంపాదించారని ఆరోపించారు.
ఇన్ని నేరాలకు పాల్పడ్డ చిదంబరం.. ఆర్థిక, రాజకీయ అంశాలపై ధైర్యంగా ఉపన్యాసాలు ఇచ్చిన వైనం తనకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు. పట్టపగలే చిదంబరం దోపిడీలకు పాల్పడ్డారని ఆరోపించారు. చిదంబరం పాల్పడ్డ అక్రమాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. ధనికుల కోసం పేదలను దరిద్రంలో కూరుకుపోయేలా చిదంబరం వ్యవహరించారని మండిపడ్డారు. దేశంలో నాడు స్కాంలకు పాల్పడ్డ అందరితోనూ చిదంబరం ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు.