హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్‌లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పాత భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Mon Jan 19, 2015 06:51 pm