హైదరాబాద్ : ఐపీఎల్ తాజా సీజన్‌లో మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ ఓ కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేనట్టేనని చెప్పాలి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి వైదొలగిన ముంబై జట్టుతో హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో తలపడనుంది. టాస్ నెగ్గిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటిదాకా ఇరు జట్లు 12 మ్యాచ్‌లు ఆడగా... 5 విజయాలతో హైదరాబాద్ జట్టు 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో 3 మ్యాచ్‌లు మాత్రమే నెగ్గిన ముంబై జట్లు కేవలం 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. వెరసి ముంబై ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి వైదొలగగా...ఈ మ్యాచ్‌లో ఓడితే హైదరాబాద్ జట్టు కూడా అదే బాటన నడవనుంది.
Mon Jan 19, 2015 06:51 pm