హైదరాబాద్ : కారు అదుపుతప్పి హీరో బాలకృష్ణ ఇంటి గేట్‌వైపు దూసుకెళ్లిన ఘటన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లో చోటుచేసుకుంది. కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న ఓ యువతి..అంబులెన్స్ వస్తుందని దారి ఇవ్వబోయింది. ఈ క్రమంలో కారు అదుపు తప్పడంతో డివైడర్ ఎక్కి..ఆ పక్కనే ఉన్న సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి గేట్ వైపునకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు సదరు యువతికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో ఆ యువతి ఆల్కాహాల్ ఏం తీసుకోలేదని నిర్దారణ అయింది. పోలీసులు ఆ వాహనాన్ని బయటకు తీశారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm