హైదరాబాద్ : తెలంగాణలో భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, రోజువారీ కేసులు 50కి లోపే నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 13,930 శాంపిల్స్ పరీక్షించగా, 38 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 27 కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 42 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్త మరణాలేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,92,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,184 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 370 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
Mon Jan 19, 2015 06:51 pm