హైదరాబాద్ : ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణిత 20 ఓవర్లకు 193 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్ మెన్లలో రాహుల్ త్రిపాఠి (76) అధ్బుత బ్యాటింగ్ తో అలరించగా ఓపెనర్ గార్గ్ (42), పూరన్ (38) తో రాణించగా జట్టుకు భారీస్కోరు నమోదు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ కు 194 పరుగుల భారీ లక్ష్యం నిర్ధేశించారు. ముంబై బౌలర్లలో రామ్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా సామ్స్, మెరిడిత్, బూమ్రా తలో వికెట్ తీశారు.