హైదరాబాద్: రోడ్డుపైనే ఓ వ్యక్తి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన బీజేఆర్ నగర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... బీజేఆర్‌నగర్‌లోని మల్లికార్జునగర్‌లో శంకర్ (29) భార్య ముగ్గురు పిల్లలతో కలసి ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చెలరేగేవి. ఈ క్రమంలోనే మంగళవారం మల్లికార్జునగర్ కమాన్ వద్ద శంకర్ యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 సిబ్బంది హుటాహుటిన అక్కడకి చేరుకొని శంకర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm