హైదరాబాద్ : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి పెట్టనుంది. అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లేబొరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఇంగ్లాండ్‌కు చెందిన సర్ఫేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ సంస్థ ప్రకటించింది. యూకేలో పర్యటిస్తున్న పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ఎండీ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్, ప్రతినిధుల బృందం బుధవారం సమావేశమైంది. అనంతరం లేబొరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. హైదరాబాద్‌లో ఏడువేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ల్యాబ్‌లో ఔషధాల తయారీలో కీలకమైన ఫార్మాస్యూటికల్ పార్టికల్ క్యారెక్టరైజేషన్‌పై పరిశోధనలు చేపడతారు. పలు జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు ఈ లేబొరేటరీ వేదిక కానుంది. రాబోయే రెండేండ్లలో ల్యాబ్‌ను మరింతగా విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు సర్ఫేస్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm