హైదరాబాద్ : ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లలతో బీఆర్కే భవన్‌లో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జి.ఓ.నెం.58, 59 ధరఖాస్తుల ప్రాసెసింగ్, అన్ని జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల గ్రౌండింగ్, తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణముల నిర్మాణం, బహుళస్థాయి అవెన్యూ ప్లాంటేషన్లు, బ్లాక్ ప్లాంటేషన్లు, వరి సేకరణ, దళిత బంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఇటివల కురిసిన వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎస్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm