హైదరాబాద్ : ఎప్పుడు ఏం ఇవ్వాలో సీఎం జగన్‌కు తెలుసు అని నటుడు ఆలీ అన్నారు. రాజ్యసభ సీటు ఆయనకు రాకపోవడం గురించి బుధవారం ఆయన మాట్లాడారు. తాను రాజ్యసభ సీటును తాను ఆశించలేదని చెప్పారు. జగన్ దృష్టిలో తాను ఉన్నానని తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా బాధ్యతగా నిర్వర్తిస్తానని తెలిపారు. నీకు ఫలానా పదవి ఇస్తానని జగన్ ఏనాడూ చెప్పలేదని... అయితే ఏదో ఒక పదవి ఇస్తానని మాత్రం చెప్పారన్నారు. తనకు కూడా ఆ నమ్మకం ఉందని చెప్పారు. వక్ఫ్ బోర్డు పదవి కూడా తనకు ఇవ్వలేదని... ఇప్పటికే దాన్ని ఇతరులకు కేటాయించారని చెప్పారు. నటుడిగా జీవితం ఇచ్చింది ఎస్వీకృష్ణారెడ్డి అని.. రాజకీయంగా నన్ను తీర్చిదిద్దుతోంది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm