వాషింగ్టన్ : ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ముందుకు వచ్చి.. ఇప్పుడు వెనక్కి తగ్గుతున్న టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు ట్విట్టర్ బోర్డు హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం రూ.3.2 లక్షల కోట్లు చెల్లించి సంస్థను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాకపోతే ఎలన్‌ను వదిలేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. చట్టం ద్వారా తాము ఎమి చేయాలో అది చేస్తామని పేర్కొన్నట్టు కథనాలు వస్తున్నాయి.
ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలు అధికంగా ఉన్నాయని, వాటిపై స్పష్టత వచ్చే వరకు ఒప్పందం ముందుకు సాగదని ఎలన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌లో ఇరు వర్గాల్లో ఎవరూ వెనక్కి తగ్గిన బిలియన్ డాలర్లు (రూ.7600 కోట్లు) చెల్లించాలనే షరతు ఉంది. అయితే ఎలన్ మాట మారుస్తున్న నేపథ్యంలో దీన్ని అమలు చేయాలని ట్విట్టర్ బోర్డు భావిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 May,2022 09:33PM