గాంధీనగర్ : తమ పెండ్లికి వచ్చిన కానుకలను చూస్తుండగా ఓ టాయ్ పేలడంతో వరుడికి, అతని మూడేండ్ల మేనల్లుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుజరాత్‌లోని నవ్సారి జిల్లాలో వెలుగుచూసింది. అయితే అలాంటి పేలుడు బహుమతి కావాలనే ఓ వ్యక్తి ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. అతని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకెళ్తే.. లతీష్ గవిత్, సల్మాల పెండ్లి మింధబారి గ్రామంలో మే 12వ తేదీన ఘనంగా జరిగింది. ఈ వివాహానికి బంధువులు, స్నేహితులు హాజరై వధూవరులను బహుమతులు అందజేశారు.అయితే మే 17న లతీష్, అతని మేనల్లుడు జియాన్ తో కలిసి పెండ్లికి వచ్చిన బహుమతులను ఓపెన్ చేయడం మొదలు పెట్టారు. అందులో ఒక రీఛార్జ్‌బుల్ టాయ్ ఉంది. దానికి రీఛార్జ్ పెట్టేందుకు ప్రయత్నించగా ఆ టాయ్ పేలింది. దాంతో కొత్త పెండ్లి కొడుకు లతీష్ చేతులు, తలకు, కండ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అతని మేనల్లుడు జియాన్‌కు తల, కండ్లలో గాయాలయ్యాయి. దాంతో వీరిద్దరిని నవ్‌సారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో లతీష్ కుడి మణికట్టు నుంచి చేయి కత్తిరించాల్సి వచ్చింది.
గతంలో వధువు అక్కతో ప్రేమ వ్యవహారం నడిపి అనంతరం వివాహేతరం సంబంధం పెట్టుకున్న కోయంబాకు చెందిన రాజు పటేల్ అనే వ్యక్తి ఈ రీచార్జిబుల్ బొమ్మను బహుమతిగా ఇచ్చాడని వరుడి తల్లిదండ్రులు తెలిపారు. వారు కూడా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. వధువు తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు.
సబ్-ఇన్‌స్పెక్టర్ వాఘేలా మాట్లాడుతూ 'మేము బుధవారం రాజును పట్టుకున్నాము. విచారణలో రాజు ఇలాంటి నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు. వధువు అక్కతో పాటు ఆమె తల్లిదండ్రులపై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి బహుమతిని పంపి వారికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. రాజు అలాంటి టెడ్డీ బేర్‌ను ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడనే దానిపై మరింత సమాచారం కోసం మేము ప్రయత్నిస్తున్నాము. ఎడమ చేతికి గాయాలతో పాటు ముఖంపై గాయాలు కావడంతో లతేశ్ పరిస్థితి విషమంగా ఉంది. జియాన్ష్‌కు కూడా తీవ్ర కాలిన గాయాలయ్యాయి` అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 May,2022 09:46PM