హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని శివతండాకు చెందిన 16 సంవత్సరాల బాలుడిని మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన తోటి బాలుడు బ్లేడ్‌తో తీవ్రంగా గాయపరిచారు. మంగళవారం రాత్రి గ్రామ శివారులో సుమారు 15 నుంచి 16 సంవత్సరాల గల పిల్లల మధ్యన మాటమాట పెరిగి కొట్లాడుకున్నారు. అక్కడే ఉన్న 16 సంవత్సరాల బాలుడు వారిని విడిపించడానికి యత్నించగా అందులో ఒక బాలుడు మధ్యలో వెళ్లిన 16 సంవత్సరాల బాలుడి మెడతో పాటు చెవి కింద భాగంలో బ్లేడ్‌తో తీవ్రంగా గాయపరిచాడు. దీంతో వెంటనే అతనిని మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బుదవారం బాధిత బాలుడి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దాడికి పాల్పడిన బాలుడిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్సై రాజారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm