హైదరాబాద్ : రాజస్థాన్‌లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిపై ఓ మొసలి దాడి చేసి అతడిని లాక్కెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు మొసలి లాక్కెళ్లిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఖటోలి పట్టణంలోని పార్తి నదిలో బిల్లూ అనే 38 ఏళ్ల వ్యక్తి స్నానానికి దిగాడు. అప్పటికే అక్కడ నక్కి ఉన్న మొసలి ఒక్కసారిగా అతడిపై దాడిచేసి నోట కరుచుకుని నదిలోకి లాక్కెళ్లిపోయింది. నదిలో స్నానం చేస్తున్న మిగతా వారు భయంతో ఒడ్డుకు చేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నది వద్దకు చేరుకుని బిల్లూ కోసం గాలించారు. నదిలో మొసళ్లు ఉండడంతో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm