హైదరాబాద్ : ఆడుకుంటున్న చిన్నారిపై టీవీ పడటంతో మృతి చెందింది. బంజారాహిల్స్ ఫస్ట్ ల్యాన్సర్‌కు చెందిన ఎండీ లయీజుద్దీన్ కార్పెంటర్. ఈ నెల 12న ఇంట్లోనే ఉన్నాడు. అతడి కుమార్తె మెహ్రాజ్ ఫాతిమా (2) ఆడుకుంటోంది. ఆమె అల్లరి పనులను తల్లిదండ్రులు సంబరంగా చూస్తున్నారు. తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లిన ఫాతిమా టీవీ స్టాండ్‌కు తగిలింది. దీంతో దాని మీద ఉన్న 22 ఇంచుల టీవీ ఆమెపై పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో చిన్నారి స్పృహ తప్పింది. వెంటనే తల్లిదండ్రులు విజయ్‌నగర్‌కాలనీలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం బంజారాహిల్స్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు తలకు శస్త్ర చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది.
Mon Jan 19, 2015 06:51 pm