హైదరాబాద్ : దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 4,25,89,841 మంది కోలుకోగా, 5,24,303 మంది మరణించారు. ఇంకా 15,419 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 10 మంది మృతిచెందగా, 2582 మంది కరోనా నుంచి బయటపడ్డారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలో 532 ఉండగా, కేరళలో 596, మహారాష్ట్రలో 307, హర్యానాలో 257, ఉత్తరప్రదేశ్‌లో 139 కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో 77.45 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm