అమరావతి : బాపట్ల జిల్లాలో ఇటీవల మహిళ వాలంటీర్ హత్య కేసులో నిందితుడు బుధవారం ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. ఈనెల 15న బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలిలో వాలంటీర్ శారదను పద్మారావు(35) హత్య చేసి పారిపోయాడు. అయితే బుధవారం తెల్లవారుజామున నిందితుడు నిడుబ్రోలు రైలు స్టేషన్‌లో తిరుపతి -విశాఖ డబుల్ డెక్కర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని.. అతని వద్ద ఉన్న కార్డుల ఆధారంగా అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm