హైదరాబాద్ : రాజ్యసభ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) నామినేషన్ దాఖలు చేశారు. గురువారం రవిచంద్ర ముందుగా హైదరాబాద్ లోని గన్‌పార్కులోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆయన సమర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. అభ్యర్ధి వద్దిరాజు రవిచంద్రకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి అజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వంతో రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం దకుతున్నదని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm