లండన్ : లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం యునైటెడ్ కింగ్‌డం-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ), ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని తెలిపారు. విదేశీ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్నారు. రాష్ట్రంలో సమగ్రమైన, ప్రగతిశీల ఈవీ పాలసీని ప్రారంభించామని చెప్పారు. ఇప్పటికే పలు ఈవీ కంపెనీలు తమ కార్యకలాపాలను తెలంగాణలో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు.
1902లో స్థాపించబడిన, సొసైటీ ఆఫ్ మోటార్ తయారీదారులు & వ్యాపారులు.. యూకేలో అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వాణిజ్య సంఘాలలో ఒకటి. ఎస్ఎంఎంటీ యూకేలో 800 కంటే ఎక్కువ ఆటోమోటివ్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇది వ్యూహాలకు మార్గనిర్దేశం చేయడానికి మరియు ప్రభుత్వం, నియంత్రణ అధికారులతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 May,2022 01:10PM