హైదరాబాద్ : ప్రభుత్వ పన్ను ఎగ్గొట్టిన గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్రకు రాజ్య సభ సీటు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ కు సిగ్గుందా అంటే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఫైరయ్యారు. వీళ్లకు సీటు ఇవ్వడం కంటే డాన్ దావుద్ ఇబ్రహీంకు ఇవ్వడం బెటర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులను పట్టించుకోకుండా బడబాబులకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్ పార్టీ పత్రిక నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావుకు రాజ్య సభ సీటు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి తమ సొంత ప్రయోజనాలు చూసుకున్నారని మండిపడ్డారు. ఇక మోడీ ప్రభుత్వంపై తాను ఒక్కడినే పోరాడుతున్నానని.. రాహుల్ గాంధీ పడుకొంటున్నారని విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 May,2022 01:19PM